ఇండియాలో మళ్లీ కరోనా టెన్షన్..కేరళలో పెరిగిన కరోనా కేసులు

కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి కొన్ని ప్రాంతాల్లో పెరుగుతూ వస్తున్నాయి. సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాలా మంది విధిగా మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకుంటూ కరోనా రాకుండా జాగ్రత్త పడ్డారు. కరోనా వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందరికీ కూడా సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దాంతోపాటుగా బూస్టర్ డోసు వేసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ప్రకటన అనేది రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుం కరోనా కేసులు దేశంలో అక్కడక్కడా పెరుగుతూ వస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు బాగా పెరుగుతూ వస్తున్నాయి.

కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారంగా చూస్తే కేరళ రాష్ట్రంలో కొత్తగా 9,361 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 99 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా 378 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. అందులో చూసినట్లైతే ఇంకో 11 మంది దాకా మరణించారు. తాజా కేసులతో కలిపి, కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,88,678కి చేరింది. మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. 27,765కు మరణాల సంఖ్య పెరిగింది. ఇంకో 9,855 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 80,892కు పడిపోయింది.

కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 378 మందికి కరోనా సోకింది. అందులో 464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11 మంది మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలో చూస్తే కొత్తగా 467 మందికి కరోనా రాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బెంగాల్​లో కొత్తగా 883 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. కరోనా కేసులు ఇలా పెరుగుతూ ఉంటే మరో వైపు ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాబోవు రోజుల్లో పండగ వాతావరణం నెలకొంది. పండగలు రావడం వల్ల ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉంది. ఆ సమయంలో విధిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ లు వాడటం చేయాలని హచ్చరిస్తున్నారు. ఇలా చేయడం ఎంతో ముఖ్యమైన విషయమని వైద్యులు, అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

Leave a Comment