పాలు తాగేవారికి అలర్ట్..ఆ పాలు స్వచ్ఛమైనవా? కల్తీవా? తెలుసుకోండిలా

ప్రస్తుతం అందరూ ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో మనిషి తన స్వార్థం కోసం ఆలోచిస్తూ చాలా మందికి కీడును చేస్తున్నారు. మనిషి ధనార్జనే ధ్యేయంగా చాలా మంది బతుకుతూ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఎన్నో పదార్థాలను కల్తీ చేస్తూ ఎంతో మంది అనారోగ్యాలకు కారణమవుతున్నారు. తినే తిండి దగ్గరి నుంచి తాగే నీరు, వేసుకునే మందులు అన్నీ కల్తీయే. ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, పంచదార, నూనె, నెయ్యి, కారం, టీపొడి, పెట్రోల్, ఇలా అన్నీ కూడా కల్తీ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఏది అసలైనది, ఏది నకిలీది అని తేల్చుకోవడం వినియోగదారుడికి సవాల్ గా మారింది.

అలాంటి కల్తీ వస్తువుల జాబితాలో ప్రస్తుతం పాలు కూడా చేరింది. పాలల్లో నీరు కలపడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. స్వచ్ఛమైన పాలను కృతిమంగా యూరియా వంటివాటితో సృష్టిస్తున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది ఆ కల్తీ పాలను తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాదు పిల్లల పెరుగుదలపై కూడా ఇటువంటి పాలు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే మీరు వాడేటటువంటి పాలు స్వచ్ఛమైనవా లేదా కల్తీవా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు పాలలో నీరు కలిపారో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ఏటవాలుగా ఉన్న ప్రాంతంపై ఒక చుక్క పాలు వేయండి. స్వచ్ఛమైన పాలు అయితే ఆ పాల చుక్క నెమ్మదిగా తెల్లటి గీతను వదిలి ముందుకు కదిలే అవకాశం ఉంది. అదే నీరు కలిసిన పాలు అయితే వేసిన వెంటనే జర్రున జారుతూ కిందకు చేరుతుంది. మరొక విధానం ఏంటంటే పాలను స్టార్చ్ లాడిన్ ద్రావణంలో ఒక చుక్క పాలు వేయండి. అవి నీలం రంగులోకి మారితే పాలల్లో పిండి కలిపినట్లు లెక్క అని అర్థం చేసుకోవచ్చు.

యూరియాతో తయారు చేసిన పాలను గుర్తించడం చాలా సులభం. ఒక చుక్క పాలను తీసుకుని యూరియా ఒక టెస్ట్ ట్యూబ్‌లో వేయండి. దానిలో కొంచెం పసుపుని వేయండి. తర్వాత బాగా కలపండి. కొంచెం సేపటి తర్వాత ఆ పాలకు ఎరుపు లిట్మస్ కాగితాన్ని యాడ్ చేయండి. ఆ కాగితం నీలం రంగులోకి మారితే, పాలలో యూరియా కలిసిందని అర్ధం.

సింథటిక్ పాలు చేదుగా ఉంటాయి. అంతేకాదు పాలను తీసుకుని చర్మంపై రుద్దితే సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు ఈ పాలు వేడి చేసిన తర్వాత పాలు పసుపు రంగులోకి మారుతాయి. డిటర్జెంట్లను కూడా పాలలో కలుపుతున్నారు. డిటర్జెంట్ ను 5 నుండి 10 మి.లీ పాలలో సమానమైన నీటిని బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఎక్కువ నురుగు వస్తే ఆ పాలల్లో డిటర్జెంట్ కలిపినట్లు లెక్క అని అర్థం చేసుకోండి.

కల్తీ పాలను గుర్తించడానికి ప్రస్తుతం షాప్స్ లో యూరియా స్ట్రిప్ దొరుకుతున్నాయి. వీటి సాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. కల్తీ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం. అనేకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ పాలు తాగడం వలన క్షయ వ్యాధి వస్తుంది. అంతేకాదు నత్రజనితో యూరియా కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, గుండె, కాలేయం వంటి అవయవాలు వైఫల్యానికి దారితీస్తాయి. సోడియం వంటి పదార్థాలు శరీరంపై ప్రభావం చూపిస్తాయి. గుండెజబ్బులకు కారణమవుతాయి. అంతేకాదు పిల్లల ఎదుగుల కుంటుబడుతుంది. కాబట్టి కల్తీ పాలు ఏదో తెలుసుకుని తాగడం ముఖ్యమని అర్థం చేసుకోండి.

Leave a Comment