సేఫ్ జోన్ లోనే భారత్ : WHO

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (మూడో దశ) లెవల్ కు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం తాజాగా నివేదిక వెల్లడించింది. అయితే భారత్ లో కరోనా వ్యాప్తి మూడో దశలో ఉందంటూ ప్రకటించి 1.35 కోట్ల భారతీయులను భయాందోళనకు గురిచేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము తప్పుగా అంచనా వేశామని అంగీకరించింది. అయితే భారత్ ఒకింత సేఫ్ జోన్ లోనే ఉందని ప్రకటించింది. 

భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. గతంలో ఇచ్చిన నివేదికలో భారత్ లో కరోనా మూడో దశలో ఉందని పేర్కొనడం తమ తప్పిదమేనని అంగీకరించింది. అది పొరపాటుగా అంగీకరిస్తూ సవరణ చేసింది. దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులు ఉన్నాయని వివరణ ఇచ్చింది. అయితే భారత్ కు కరోనా ముప్పు లేదని భావిస్తే అది పొరపాటేనని, ఈ దశలోనే కరోనాను పూర్తిగా నియంత్రించాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. లాక్ డౌన్ అయినా లేదా ఇతర నియంత్రణ చర్యలైనా మరింత పకడ్బంధీగా కొనసాగిస్తే కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకోలేదని సలహా ఇచ్చింది. 

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ విషయంలో విమర్శలు కూడా వస్తున్నాయి. చైనాలో మొదలైన కరోనాను ఆలస్యంగా గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో జాప్యం చేసింది. అయితే తమ తప్పులను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొలాన్డ్ ట్రంప్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పని తీరును తప్పుపడుతున్నాడు. ఈ తరుణంలోనూ ఆ సంస్థ పనితీరు ఏమాత్రం మెరుగు పడడం లేదు. 

Leave a Comment