ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి : సీఎం జగన్

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా కరోనా వైరస్ లాంటి వైరస్, ఇతర వ్యాధులను అడ్డుకోగలమని సీఎం జగన్ తెలిపారు. లాక్ డౌన్ సహా కరోనా వైరస్ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్యంపై దాడిచేస్తున్న ఇలాంటి వైరస్‌లను, వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వ పరంగా సిద్ధం కావాలన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బందికి క్రిటికల్‌ కేర్‌లో భాగంగా వెంటిలేటర్ల వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నారు. నిర్మాణాత్మక ఆలోచనలతో, సమగ్ర కార్యాచరణలతోనే ఇలాంటి వైరస్‌లను, వ్యాధులను అడ్డుకోగలమన్నారు. దీంట్లో భాగంగా ఆరోగ్య రంగంలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాడు –నేడు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయగలిగితే… ఆరోగ్య పరంగా వచ్చే కరోనా వైరస్‌ లాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగులుగుతామన్నారు. ఆరోగ్య పరంగా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినా దానికి మనం సిద్ధంగా ఉండాలని సీఎం తెలిపారు. 

16 వైద్య కళాశాలలు ఏర్పాటు దిశగా చర్యలు..

రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో  సరిపడా వైద్యులు, వైద్య సిబ్బందిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఇది వరకే ప్రతిపాదించిన విధంగా కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. 

2021 నాటికి గ్రామ క్లినిక్ల లు..

గ్రామాలు, వార్డుల వారీగా 2021 మార్చి నాటికి గ్రామ, వార్డు క్లినిక్కులు పూర్తిచేయాలన్నారు.  దీనివల్ల క్షేత్రస్థాయి  వరకూ ప్రజల ఆరోగ్య పరిరక్షరణకు ఒక సమగ్ర యంత్రాంగాన్ని నిర్మించుకున్నట్టు అవుతుందన్నారు. అలాగే ఆరోగ్యకార్డుల జారీ, వాటిలో నమోదు ప్రక్రియను కూడా ఇదే సమయంలో మొదలు పెట్టాలన్నారు. ప్రతి ఇంటికీ సర్వే, భారీగా ర్యాపిడ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆరోగ్యకార్డుల్లో వివరాల నమోదుకూడా చేయాలన్నరు. 

లాక్ డౌన్ ఎత్తివేస్తే ఏం చేయాలి..

లాక్ డౌన్ ను ఒక వేళ ఎత్తి వేస్తే ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలు, అక్కడ అనురిస్తున్న విధానాలపై సీఎంకు అధికారులు వివరించారు. వీలైనన్ని పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ సోకిన వారిని గుర్తించడం, వారి ప్రైమరీ కాంటాక్టులను ట్రేస్‌ చేయడం ద్వారా వారికి వైద్యాన్ని అందించాలన్న స్ట్రాటజీ ప్రకారం ముందుకు సాగుతున్నామని తెలిపారు. 

 

Leave a Comment