Ind vs Aus : మ్యాచ్ లో క్రేజీ సీన్.. లవ్ ప్రపోజ్ చేసిన భారత అభిమాని..

ఇండియా, ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనబడింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ భారత అభిమాని, తన ఆస్ట్రేలియా గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల పై కూర్చొని రింగ్ బాక్స్ లో నుంచి రింగ్ ను తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. చుట్టూ అంత మంది మధ్యలో లవ్ ప్రపోజ్ చేయడంతో ఆమె తన్మయత్వానికి లోనైంది. 

వెంటనే అతని ప్రపోజల్ ను అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకున్నారు. అదే సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్ వెల్ నవ్వుతూ, చప్పట్లు కొడుతూ వారిని అభినందించాడు. ఈ సమయంలో ఆ యువతి ఆస్ట్రేలియా టీమ్ జర్సీలో ఉండగా, భారత అభిమాని ఇండియా జెర్సీలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారంది.   

Leave a Comment