లిఫ్ట్ లో ఇరుక్కున్న 5 ఏళ్ల బాలుడు.. లిఫ్ట్ గ్రిల్స్ లో నలిగిపోయి మృతి..!

లిఫ్ట్ డోర్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ముంబైలోని ధారావిలో శనివారం చోటుచేసుకుంది. షాహుర్ నగరలోని కోజీ షెల్టర్ అనే అపార్ట్ మెంట్ లో మహ్మద్ హోజైఫ్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్ కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్ కు గ్రిల్స్ తో పాటు డోర్ కూడా ఉంది. లిఫ్ట్ కింది ఫ్లోర్ కు రాగానే డోర్ తెరుచుకుంది. దీంతో హోజైఫ్ స్నేహితులు బయటికి వెళ్లిపోయాడు.

 అయితే లిఫ్ట్ లో హోజైఫ్ మాత్రమే ఉండిపోయాడు. అందరికంటే చివరగా ఉండటంతో బయటకు వచ్చి లిఫ్ట్ గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉండి బయటకు రాలేకపోయాడు. ఇంతలో మరొకరు లిఫ్ట్ బటన్ ను నొక్కారు. దీంతో లిఫ్ట్ కిందికి కదలింది. దీంతో బాలుడు లిప్ట్ గ్రిల్స్ లో నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

Leave a Comment