ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం..

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు నేటి నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా ఈ చట్ట చేయిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల్లో ఎవరు కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్ట సవరణ చేసినట్లు పేర్కొన్నారు. 

కాగా ఈ బిల్లు ఆమోదం తర్వాత టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. చర్చ జరగకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. గతంలోనే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి సభలో చర్చ జరిగిందని, బిల్లు ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే వారు దాన్ని వెనక్కి పంపించారని అన్నారు. ఈ బిల్లుపై ఇప్పటికే చర్చ జరిగినందున మళ్లీ చర్చ జరపాలని ప్రతిపక్షం కోరడం సరైంది కాదని సీఎం జగన్ పేర్కొన్నారు.   

Leave a Comment