పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గత నెల పెంచిన కంపెనీలు మళ్లీ ఈ నెల కూడా ధరలను స్వల్పంగా పెంచాయి. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమలులోకి వస్తాయి. మెట్రో నగరాల్లో సిలిండర్ కు రూ.4.50 వరకు ధరలు పెంచాయి. ఢిల్లీలో సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఒక రూపాయి, ముంబైలో రూ.3.50, కోల్ కతాలో రూ.4.50, చెన్నైలో రూ.4, హైదరాబాద్ లో రూ.4.50 చొప్పున పెరిగాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరోనా వల్ల ధరలు తగ్గించి కొంత ఉపశమనం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మళ్లీ ధరలను పెంచుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారం తప్పడం లేదు. 

తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. 

హైదరాబాద్ – రూ.645.50

ఢిల్లీ – రూ.594

కోల్ కతా – రూ.620.50

ముంబై – 594

చెన్నై – 610.50

 

Leave a Comment