టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతున్న ‘చింగారి’..!

మన దేశంలో విదేశీ మోజు ఎక్కువ. అందువల్ల మన స్వదేశీ వస్తువులు ఆదరణకు నోచుకోలేదు. మన స్వేదశీ యాప్స్ ఎన్ని ఉన్నా..మనం విదేశీ యాప్ల వైపు మొగ్గుచూపాం. ఇప్పుడు భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్లను నిషేధించింది. అందులో అత్యంత్య ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ కూడా ఒకటి. ఇంకేముంది టిక్ టాక్ బ్యాన్ అనగానే చాలా మందికి నద్రపట్టడం లేదు.  

ఇక గూగుల్ ప్లేస్టోర్ మరియు యాపిల్ యప్ స్టోర్ నుంచి టిక్ టాక్ ను తొలగించారు. టిక్ టాక్ బ్యాన్ కావడం వల్ల చాలా మంది సెలబ్రెటీలు అయోమయంలో పడ్డారు. ఇక వారు ఊరుకుంటారా..టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా ఏ యాప్ లు ఉన్నాయో అని సెర్చ్ చేశారు. అప్పుడు కనపడ్డాయి..‘Chingari’ మరియు ‘Bolo ఇండియా’ వంటి స్వదేశీ యాప్స్..ఇంకేముంది ఆ రెండు యాప్లలో ‘Chingari’ యాప్ ను లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఏకంగా ఒక గంటలోనే లక్ష మంది డౌన్ లోడ్ చేసినట్లు సంస్థ తెలిపింది. 

వాస్తవానికి టిక్ టాక్ ను దేశంలో 20 కోట్ల మంది ఫాలో అవుతారు. వారంతా టిక్ టాక్ కు ప్రత్యామ్నాయం వైపు చూడటంతో ‘Chingari’ యాప్ కు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో చైనా అనువర్తనాలను నిషేధించినందుకు భారత ప్రభుత్వానికి మరియు పీఎంఓకు ‘Chingari’ టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. 

‘Chingari’ యాప్ ను బెంగళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ గతేడాది రూపొందించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. తాను టిక్ టాక్ డౌన్లోడ్ చేసుకోలేదని, కానీ తాను ‘Chingari’ డౌన్ లోడ్ చేశానని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. 

 

Leave a Comment