కర్నూలు జిల్లాలో అక్కడ లాక్ డౌన్ సడలింపులు

కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 50 కంటైన్ మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 9 క్లస్టర్ కంటైన్మెంట్ జోన్లలో 45 రోజుల నుంచి యాక్టివ్ కేసులు లేకపోవడంతో లాక్ డౌన్ ఎత్తి వేస్తున్నామని తెలిపారు. 

ఇతర క్లస్టర్లలో 20 రోజుల పాటు పాజిటివ్ కేసు నమోదు కాకపోెతే అక్కడ లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతాయని పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రదేశాలలో ఎలాంటి సడలింపులు ఉండవని చెప్పారు. 

ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదు..

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఉన్నప్పటికీ ఎలాంటి వేడుకలు, పండుగలు జరపుకోకూడదని జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప  తెలిపారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని, కేసులు నమోదైన ప్రాంతాల్లో సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. అయితే లాక్ డౌన్ ఉల్లంఘించి సీజ్ అయిన వాహనాలను ఆదివారం నుంచి విడుదల చేస్తామని చెప్పారు.   

Leave a Comment