రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం ఎలా?

సాగుపెట్టుబడి కోెసం రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైఎస్సార్ రైతుభరోసా’ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మే 15న ప్రారంభించారు. ఒకే సారి రైతుల కుటుంబాల ఖాతాలో నేరుగా నగదు జమ చేశారు. 49,43,590 రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి రైతులకు మొదటి విడత రూ.7,500 లో రూ.5,500 ఇచ్చారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రైతులకు గత నెలలో రూ.2000 ముందుగానే ఇచ్చారు. 

రైతు భరోసా పథకం అంటే ఏమిటీ?

రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.67,500 రైతులకు లభిస్తాయి. రుణంగా కాకుండా వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసే పెట్టుబడిగా ఇస్తారు. రబీ పంట కోసం పెట్టుబడులు పెట్టడానికి అక్టోబరు నెలలో రెండో విడత రూ.4వేలు ఇస్తామని, 3వ విడత రూ.2వేలు సంక్రాంతికి బదిలీ చేస్తామని ఏపీ సీఎం తెలిపారు. 

రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. 80 శాతం మంది రైతులు ఒక హెక్టార్ కంటే తక్కువ భూములు కలిగి ఉన్నారు. 50 శాతం మంది హెక్టార్ లోపు కలిగి ఉన్నారు. అందువల్ల వారికి సహాయం చేయడం చాలా ముఖ్యమని సీఎం కూడా తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి లబ్ధిదారుల పేర్లు గ్రామ సచివాలయాల్లో్ ప్రదర్శించారు. ఏ కారణం చేతనైనా వదిలిపెట్టిన వారు ఒక నెలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 

రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి.

  • వైఎస్సార్ రైతు భరోసా యొక్క అధికారిక వెబ్ సైట్ https://ysrrythubharosa.ap.gov.in లోకి వెళ్లండి. 
  • హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కుడి వైపు ‘లాగిన్’ బటన్ ను క్లిక్ చేయండి. 
  • లాగిన్ కావడానికి మీ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. కాప్చా ఎంటర్ చేసి వెరిఫై చేయండి. 
  • తర్వాత ‘Payment Status’ బటన్ మీద క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా కోడ్ ను నమోదు చేయండి. అప్పుడు వివరాలను పూర్తి చేయండి. తర్వాత ‘Submit’ బటన్ పై క్లిక్ చేయండి. 
  • మీ Payment Status స్క్రీన్ పై కనబడుతుంది. 

Leave a Comment