‘సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు’.. విడాకులపై కొత్త వాదన..!

ఎనిమిదేళ్ల ప్రేమాయణం.. దాదాపు నాలుగేళ్ల పెళ్లి బంధం.. ఈ బంధానికి సమంత, నాగచైతన్య వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఎక్కడ చూసిన సామ్, చైతుల టాపిక్ మాత్రమే నడుస్తోంది. వీరి విషయంలో ఎవరికి నచ్చింది వారు చెప్పుకుంటున్నారు. ఎవరికి తోచింది వారు రాసుకుంటున్నారు. కొందరు సినిమాలు కారణమని, మరికొందరు ఫ్యాసన్ డిజైనర్ కారణమంటూ చెబుతున్నారు. 

ఇక సినీ సెలబ్రెటీలు అయితే వీరి విడాకులపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని, ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని గౌరవించాలని చెబుతున్నారు. ఈక్రమంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పరిశోధకుడు ఇమంది రామారావు సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామ్, చైతుల విడాకులపై పలు కారణాలు, మరెన్నో కోణాలను ప్రస్తావించారు. 

ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ.. తప్పంతా సమంతదేనని అన్నారు. సమంత ఈ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాల్సిందని తెలిపారు. చిన్ని చిన్ని అపార్థాలు ఏ దాంపత్యంలో అయినా వస్తాయన్నారు. నాగార్జున చాలా వైడ్ గా ఆలోచిస్తారని, వెనకాల సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఉన్నారని, సమంత తొందరపడినా వాళ్లు తొందరపడరని అన్నారు. ఏవైన సమస్యలు ఉంటే వారితో చెప్పుకోవాల్సిందన్నారు.

సమంతకు చైతు సరైన వాడే అన్నారు. వీరి విడాకులకు పిల్లలు కూడా ప్రధాన కారణమన్నారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, సరోగసి ప్రయత్నిద్దామని చెప్పిందని అన్నారు. ఇది మగవాడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఓ ఆరు మాసాల తర్వాత సమంత, చైతు కలిసి ఉండాలనుకుంటే ఆ అవకాశాన్ని కోర్టు కల్పిస్తుంది రామరావు చెప్పారు. మీర ఈ వ్యాఖ్యలపై మీరేమంటారో చెప్పండి…  

     

Leave a Comment