ఏపీకి బిగ్ అలర్ట్.. ఈనెల మొత్తం వర్షాలే..!

అక్టోబర్ నెల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో పాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో ఏపీలో ఈ నెలాఖరు వరకు వర్షాలు జోరందుకోనున్నట్లు పేర్కొంది. బుధవారం నుంచి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలు కానుంది. 

మరోవైపు తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం పైకి వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.     

 

Leave a Comment