మహిళా పోలీస్ పై ఎస్సై అత్యాచారం..!

దేశంలో మహిళలు, చిన్నారులకే కాదు మహిళా పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. అది కూడా రక్షణ కల్పించాల్సినా పోలీసులే భక్షకులయ్యారు. తాజాగా ఓ ఎస్సై మహిళా పోలీస్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని అలీఘర్ కు చెందిన రాకేశ్ యాదవ్ క్రైం బ్రాంచ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 

గత అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డ్యాక్యుమెంట్లు తీసుకొని తాను ఉన్న హోటల్ గదికి రావాలని ఓ మహిళా పోలీస్ ను ఆదేశించాడు. హోటల్ గదికి వెళ్లిన మహిళా పోలీస్ పై ఆ ఎస్సై అత్యాచారం చేశాడు. ఎవరికైనా విషయం చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు. 

దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీన్ని అలుసుగా భావించిన ఆ ఎస్సై తరుచు ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు వేచిన ఉన్న మహిళా పోలీస్ సహనం కోల్పోయింది. అతనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్సైని సస్పెండ్ చేశారు. ఆ ఎస్సై పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

Leave a Comment