జీవితంలో మార్పు కావాలా..చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే..!

ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు.. ఇందులో సమాజానికి మార్గనిర్దేశం చేయడానికి అనేక జీవన విధానాలను అందించారు. ఆయన జీవితంలో ఎన్నో కష్ట సమయాలను చూశాడు. ఆయనకు ఎదురైన ప్రతి పరిస్థితి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేశారు. చాణక్య నీతి పుస్తకంలో తన జీవితంలో ఎదురైన కష్టలు, అనుభవాలను రాసుకొచ్చారు. ఆయన నీతులు అప్పటి తరం నుంచి నేటి తరం వరకు వారి భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తోంది..

చాణక్య నీతి..

  • తన పుస్తకంలో నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలి.. ఎవరిని నమ్మాలి.. ఎలాంటి వ్యక్తులను విశ్వసించాలి అనే అనేక అంశాలను పొందుపరిచారు. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు.. వంద కుక్కల కంటే వీధి ఆవు గొప్పది.. నిన్ను పొగిడే వంద మంది కంటే.. వ్యతిరేక స్వభావం గల ఒక మంచి వ్యక్తి గొపవాడని అర్థం చేసుకో..
  • మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే.. మనస్ఫూర్తిగా ఏదైనా చేయండి.. చేసే ప్రతిపనిని ముగించే వరకు ఆలోచించి.. అర్థం చేసుకుని చేయాలి.. మీ తెలివిని సరిగ్గా ఉపయోగించి నిర్ణయం తీసుకోండి..
  • ఒక మంచి పని కూడా విధికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఆ సమయంలో చెడు వైపు అడుగులు వేయకండి.. ఎందుకంటే మీరు చేసే పని మీ జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
  • అబద్ధం చెప్పే వ్యక్తి ఏదో ఒకరోజు కష్టాల్లో కూరుకుపోతాడు. ఎందుకంటే.. అబద్ధాన్ని దాచడానికి చాలా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ, దేనికీ అబద్ధం చెప్పకండి.. 
  • చేసే పనిలో విజయం కోసం ఔదార్యం ఎప్పుడూ తీసుకోకూడదు.. ఎందుకంటే ఆవు దూడ పాలు తాగాలంటే తల్లి పొదుగును కొట్టాలని గుర్తుంచుకోండి..

Leave a Comment