మన నేషనల్ మీడియాను చూస్తే జాలేస్తుంది…

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మరణించారు. శనివారం ఉదయం చెన్నైలోని ఫాంహౌస్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. 16 భాషల్లో 40 వేల పాటలను పాడిన గాన గంధర్వుడు లేడు అంటే పాటలే చిన్నబోతాయి. ఎస్పీ బాలు లేరనే వార్త అబద్ధం అయితే బాగుండు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎస్పీ బాలు గురించి మన జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు బాధేస్తుంది. దీనిపై జాతీయ మీడియాపై విమర్శలు వస్తున్నాయి. బాలు మరణాన్ని అంతర్జాతీయ మీడియా కూడా గొప్పగా ప్రసారం చేస్తుంటే.. మన జాతీయ మీడియా మాత్రం ఎక్కడ ప్రసారం చేయడం లేదు.. 

ఈ విషయంపై టాలీవుడ్ దర్శకుడు హరీస్ శంకర్ స్పందించారు. ట్విట్టర్ లో బాలు మరణం గురించి ఓ అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన క్లిప్ ను ట్యాగ్ చేశారు. ‘ఇంటర్నేషన్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాను చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..’ అంటూ ట్వీట్ చేశారు. 

 

Leave a Comment