కూతుళ్లు కొడుకుల కంటే తక్కువేం కాదు… అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం..!

కూతురు తక్కువ కాదు..కొడుకు ఎక్కువ కాదు.. సంతానం అంటే సమానత్వమే.. ఇది తెలుసుకుంటేనే చక్కని కుటుంబం.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ ఆదివారం అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ఉంది. భారతదేశంలో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 27న 4వ ఆదివారం కాబట్టి కూతూళ్ల దినోత్సవం జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో వేర్వేరు తేదీల్లో కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

కుతూళ్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

ఒకప్పుడు ఆడపిల్ల పుడితే ఒక వివక్షతో చూసే వారు. అదే మగబిడ్డ పుడితే సకల మర్యాదలు దక్కేవి..అతడికి సాదరస్వాగతం లభించేది. అయితే దేశంలోని అనేక ప్రాంతాల్లో నేటికీ కుమార్తెలను నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఆడపిల్లలపై ఉన్న ఈ వివక్షను తొలగించడానికి కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రవేశపెట్టారు. అందువల్ల బాలికల పట్ల వివక్షపై అవగాహన పెరిగి, లింగ సమాన్వం పెంపొందించబడుతుంది.

ఎలా జరుపుకోవాలి?

  • తల్లిదండ్రులు తమ కుమార్తెలకు కానుకలు ఇవ్వొచ్చు..
  • కుమార్తెలతో కలిసి డిన్నర్ కు వెళ్లొచ్చు..లేదా ఇంట్లో ప్రత్యేక వంటకాలు తయారు చేయవచ్చు.
  • కుమార్తెలతో నాణ్యమైన సమాయాన్ని గడపండి..
  • వారు అబ్బాయిల కంటే తక్కవ కాదని వివరించండి..
  • వారి కలలను సాకారం చేసుకోవడానికి వారిని ప్రోత్సహించండి..

 

  

Leave a Comment