ఈ జీన్స్ ధర రూ.88 వేలు..!

సాధారణంగా ఒక జీన్స్ ప్యాంట్ ధర ఎంత ఉంటుంది.. రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది. ఇంకా మంచి బ్రాండ్ అయితే రూ.7 వేల నుంచి రూ.10 వేలు ఉంటుంది. కానీ ప్యాంట్ ధర వింటే షాక్ అవుతారు. ఈ జీన్స్ ప్యాంట్ ధర రూ.88 వేలు ఉంది. ఇంత ధర ఉన్నప్పటికీ ఈ ప్యాంట్ అంత గ్రాండ్ లుక్ ఇవ్వడం లేదు..

ఇంతకు ఇది ఏ కంపెనీ ప్యాంట్ అనుకుంటున్నారా? ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ Gucci కంపెనీకి చెందినది. 2020 Winter Collection లో భాగంగా ఈ కొత్త జీన్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాంట్ పచ్చగడ్డి మరక అంటినట్లుగా ఉంటుంది. దీని ధర రూ.88 వేలు నిర్ణయించారు. లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ పై పచ్చగడ్డి మరకు అంటినట్లు దీని డిజైన్ ఉంది.

ఈ వైడ్ లెగ్ డెనిమ్ ప్యాంట్ ను సేంద్రీయ పత్తితో తయారు చేశారు. ఈ ప్యాంట్ ధరిస్తే గడ్డిలో కూర్చున్న మరకలు అంటాయనే ఫీలింగ్ కలుగుతుందని Gucci పేర్కొంది. ఇది కస్టమర్లకు ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.  మన ఇండియాలో కూడా Gucci కంపెనీకి చెందిన షాపులు ఉన్నాయి. వాటికి మంచి డిమాండ్ ఉంటుంది.

Leave a Comment