భూమా కూతురితో మంచు మనోజ్ రెండో పెళ్లి? 

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకన్న విషయం తెలిసిందే.. ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి 2015 పెళ్లి చేసుకున్నాడు.. అయితే 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులకు గల కారణాల అయితే తెలియరాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లుగా సినిమాలకు సైతం బ్రేక్ తీసుకున్నాడు.. విడాకుల తర్వాత మనోజ్ కుటుంబంతోనూ విడిగా ఉంటున్నాడు. 

అయితే మంచు మనోజ్ గురించి ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.. దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

వీరిద్దిరు కలిసి హైదరాబాద్ లోని సీతాఫలమండిలోని గణేష్ విగ్రహాన్ని దర్శించుకొని పూజలు చేశారు. మంచు మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నరనే వార్తకు బలం చేకూర్చింది. ఇక మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి.. ఆమె గతంలో ఓ వ్యక్తితో పెళ్లి చేసుకుంది. అయితే కొంత కాలానికే విడాకులు తీసుకొని దూరంగా ఉంటుంది.

 

Leave a Comment