నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని, ఏ శిక్ష అనుభవించడానికైనా రెడీ అని Kurnool MLA Hafeez khan వ్యాఖ్యానించారు. సోమవారం మీడియా ఆయన మాట్లాడుతూ కర్నూలులో  కరోనా వైరస్ వ్యాప్తి పెరగిపోతుందని, ప్రభుత్వం, అధికారులు దానిని అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో మరియు కొన్ని పత్రికలు తనపై దుష్ప్రారం చేయడం బాధాకరమని చెప్పారు. 

కుల, మత రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను నిరూపించాలని సవాల్ విసిరారు.  ఎవరు తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. 

తాను రాజకీయ దుర్వినియోగం చేశానని, తన సామాజిక వర్గానికి చెందిన వారికి క్వారంటైన్ సెంటర్ కు పంపలేదని అభియోగాలు మోపడం బాధకరమని చెప్పారు. కె.ఎమ్.హాస్పిటల్ అధినేత డాక్డర్ ఇస్మాయిల్ తనకు రాజకీయంగా వ్యతిరేకంగా చేశారని, అయినా వ్యక్తిత్వంగా ఆయన చాలా మంచి వారని అన్నారు. అయితే ఆయన ద్వారా సేవలు పొంది, ఇప్పుడు మరణించి తర్వాత ఆయన పేరు దుష్ప్రారానికి వాడుకుంటున్నారని తెలిపారు. 

పత్రికల్లో, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచురించడం మానుకోవాలని చెప్పారు. దీనిపై డిజిపి, హోం మంత్రి, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై విచారణ చేయాలన్నారు. తనది తప్పు అని తేలితే ఏ శిక్ష అనుభవించడానికి అయిన రెడీ అన్నారు. తాను తప్పు చేసింటే ఉరి శిక్షకు వెళ్లడానికి కూడా సిద్ధమని ఛాలెంజ్ చేశారు. 

Leave a Comment