దేశంలో సగం మంది తిండి లేక అల్లాడుతుంటే.. కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? మోడీకి కమల్ హసన్ ప్రశ్న?

ప్రధాని మోడీని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ సూటీ ప్రశ్నలు వేశారు. దేశంలో సగం జనాభా ఆకలితో అల్లాడుతుంటే.. ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్ అవసరమా అని ప్రశ్నించారు. కరోనాతో దేశం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రూ.1000 కోట్లతో పార్లమెంట్ భవనం నిర్మించడం ఎందుకని మండిపడ్డాడు.

కరోనా వైరస్ కారణంగా దేశంలోని సగం మంది జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారని, ఈ సమయంలో రూ.1000 కోట్లతో కొత్త పార్లమెంట్ భవనం రూపకల్పన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చైనా గోడ కట్టడానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే, ప్రజల రక్షణ కోసమే ఈ నిర్మాణం చేపట్టామని పాలకులు అన్నారని, మీ ధోరణి కూడా అలానే ఉందని విమర్శించారు. ఎవరిని రక్షించేందుకు రూ.1000 కోట్లు ఖర్చుచేస్తున్నారని, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మోడీని ప్రశ్నించారు. 

Leave a Comment