అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖలిస్థానీ మద్దతుదారుల దుశ్చర్య..!

అమెరికాలో ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి రంగులు పూసి బ్యానర్లు కప్పేశారు.  భారత్ లో కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు-అమెరిక్లు చేపట్టిన నిరసనల్లో ఈ దారుణం జరిగింది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ లో రైతులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలకు అమెరికాలో సిక్కు-అమెరికన్లు సంఘీభావం తెలిపారు. ఈనేపథ్యంలో గ్రేటర్ వాషింగ్టన్ డీసీ, మేరీ లాండ్, వర్జీనియాలతో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియా, నార్త్ కరోలినా రాష్ట్రాల నుంచి వందల మంది సిక్కులు ఆందోళనలు చేపట్టారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద కార్ల ర్యాలీ నిర్వహించారు. 

ఈ నిరసనలు శాంతియుతంగా జరుగుతున్న సమయంలో వేర్పాటువాద సిక్కులు ఖలిస్థానీ జెండాలు, భారత వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లతో ప్రవేశించి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరంతా ‘ద రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్’ కు చెందిన వారిగా పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల వాషింగ్టన్ మెట్రోపాలిటన్ అధికారులు భారత రాయబార కార్యాలయానికి క్షమాపణలు చెప్పారు. 

 

Leave a Comment