సీఎం జగన్ కు గుడి కట్టేస్తున్నారు..!

మామాలుగా సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడి కట్టే సంప్రదాయం మనం తమిళనాడులో ఎక్కువగా చూస్తుంటారు. హీరోయిన్లు ఖుష్బూ, నమితలకు ఇప్పటికే పలుచోట్లు గుడులు కట్టేశారు. ఇప్పటి వరకు మన ఏపీలో ఇలాంటి కల్చర్ లేదు. కానీ ఇప్పుడా పిచ్చి మన రాష్ట్రానికి కూడా పాకింది. ఏపీ సీఎం జగన్ కి కూడా గుడి కట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో చాలా మంది సామాన్యులు లబ్ధి పొందుతున్నారు. దీంతో జగన్ వారికి దేవుడు అయిపోయారు. జగన్ పై అభిమానంతో ఒక గ్రామస్తులు గుడి కడుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజాపాలెం వైసీపీ నాయకులు మరియు గ్రామస్థులు కలిసి జగన్ కోసం గుడిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ గుడి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ గుడికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు భూమి పూజ చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా గుర్తుండి పోయేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైసీపీ నేతలు తెలిపారు.  

 

Leave a Comment