థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? ప్రభావం ఎలా ఉంటుంది? ICMR అంచనా ఏంటీ..?

కరోనా థర్డ్ వేవ్ పై ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇండియాలో ఎప్పటి నుంచి వస్తుంది? దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? అసలు థర్డ్ వేవ్ ఉంటుందా? లేదా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతిఒక్కరిలో ఉన్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రావచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. థర్డ్ వేవ్ పిల్లలతో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. థర్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్టాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. 

ఈనేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ(ICMR) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయం చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఐసీఎంఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో చెప్పడం సాధ్యం కాదని ఐసీఎంఆర్ కు చెందిన వైద్యులు సమిరన్ పాండా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా డేటాను పరిశీలించిన తర్వాత అక్కడ ఎలాంటి ప్రభావం ఉంటుందో అంచనా వేయవచ్చని వివరించారు. దీని ఆధారంగా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం కష్టం అన్నారు. 

థర్డ్ వేవ్ కు దారితీసే కారణాలు ఇవే:

  • సహజంగా లేదా వ్యాక్సిన్ ద్వారా వచ్చిన వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవడం. 
  • డెల్టా తరహాలో మరింత వేగంగా వ్యాపించే వేరియంట్ రావడం.
  • కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం.
  • వ్యాక్సినేషన్ వీలైనంత ఎక్కువ మందికి ఇవ్వకపోవడం.

Leave a Comment