కల్తీ కూరగాయలను ఈ టెస్ట్ ద్వారా గుర్తించండి.. ఒకసారి ట్రై చేయండి..!

ఈ కాలంలో ఏదీ చూసిన కల్తీమయమైపోయాయి. కల్తీ కానిదీ ఏదీ లేదు. ఏ వస్తువు చూసినా, దేంట్లో చూసినా కల్తీయే.. అసలు కల్తీ లేని సరుకు ఈ కాలంలో దొరుకుందా? అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇటీవల కూరగాయలను సైతం కల్తీ చేస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.. మార్కెట్ లో మీరు తీసుకునే తాజా కూరగాయలు అసలు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కష్టమైన పని.. అయితే అలాంటి కూరగాయలను సైతం ఓ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఇలాంటి వాటిని గుర్తించేందుకు ఓ టెస్టును రూపొందించింది. ఈ టెస్టును ఎలా చేయాలో కూడా తెలిపింది. 

కల్తీ కూరగాయలను కనిపెట్టడం ఎలా?

  • ముందుగా నానబెట్టిన ద్రవ పారాఫిన్ ను తీసుకోండి. 
  • ఈద్రవంలో కాటన్ బాల్ ని ముంచి ఆకుపచ్చని కూరగాయలపై రుద్దండి.
  • కాటన్ రంగు మారకపోతే కూరగాయల్లో కల్తీ లేనట్లు. 
  • ఒకవేళ కాటన్ ఆకుపచ్చగా మారితే మాత్రం మీ కూరగాయలు కల్తీ అయినట్లు అర్థం..

మలాకైట్ గ్రీన్ అంటే ఏంటీ?

మలాకైట్ గ్రీన్ అనేది ఒక టెక్స్ టైల్ డై.. దీన్ని చేపలకు యాంటీ ప్రొటోజోల్, యాంటీ ఫంగల్ మందుగా ఉపయోగిస్తారు. ఇది జల జీవులపై ఏర్పడే ఫంగల్ దాడులు, ప్రోటోజోవాన్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. అయితే మిరపకాయలు, బఠానీలు, పాలకూర వంటి కూరగాయలు పచ్చగా కనిపించేలా చేయడానికి ఈ మలాకైట్ గ్రీన్ ను ఉపయోగిస్తారు. 

మలాకైట్ గ్రీన్ అనే రంగు విషపూరితమని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. ఇది కార్సినోజెనిసిన్, మ్యూటాజెనిసిన్, క్రోమోజోమల్ ఫ్రాక్చర్, టెరాటోజెనిసిటీ, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. ఇది బహుళ అవయవ కణజాలాలను కూడా దెబ్బతీస్తుంది..

Leave a Comment