సినీ లవర్స్ కి షాక్.. iBomma సేవలు శాశ్వతంగా నిలిపివేత..!

iBomma ఈ పేరు తెలియని సినీ లవర్స్ ఉండరు.. ఉచితంగా హెచ్డీ క్వాలిటీతో సినిమాలు అందిస్తున్న వెబ్ సైట్ ఏదంటే అది iBomma అని చెప్పాలి.. ఓటీటీలో సినిమా వస్తే..వెంటనే అది iBomma బొమ్మ పడాల్సిందే.. అది కూడా ఫ్రీగా.. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఫీజు లేకుండా సినిమాలు అందిస్తోంది.. ఓటీటీలో సినిమా చూడాలంటే.. ఫీజు కట్టాలి.. అయితే iBomma మాత్రం సామాన్యులకు ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ సైట్ లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. 

తాజాగా iBomma సినీ లవర్స్ కి షాక్ ఇచ్చింది. తన సేవలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలు లేకుండా చేసిన iBomma.. తాజాగా తన సర్వీస్ లను పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9 నుంచి ఇండియాలో తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

భవిష్యత్తులోనూ తిరిగి తీసుకొచ్చే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. యూజర్లు ఎవరూ తమకు మెయిల్స్ చేయవద్దని కోరింది. తాము ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నామని, అందుకే iBomma సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని యూజర్స్ అర్థం చేసుకోవాలని కోరింది. ఇంతకాలం తమపై చూపిన ప్రేమాభిమానాలకు అభినందనలు అంటూ iBomma తన వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరీ iBomma నిర్వాహకులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

 

Leave a Comment