హోం వర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. చిన్నారి మృతి..!

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. హోం వర్క్ చేయలేదని ఓ చిన్నారి టీచర్ చితకబాదింది. ఆ దెబ్బలకు ఆస్వస్థతకు గురైని చిన్నారి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. నిజామాబాద్ జిల్లాలోని వుడ్ బ్రిడ్జ్ స్కూల్ లో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.. 

వివరాల మేరకు అర్సపల్లికి చెందిన ఫాతిమా(7) బోధన్ రోడ్డు ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జ్ స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోం వర్క్ చేయకపోవడంతో ఓ టీచర్ విపరీతంగా కొట్టింది. తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిబెట్టింది. స్కూల్ బ్యాగులో పుస్తకాలు నింపి బాలిక మెడపై మోయించింది. అంతేకాదు చిన్నారి తలపై స్కేలుతో కొట్టింది. 

ఆ తర్వాత చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఫాతిమాను ఆస్పత్రికి తరగించగా.. తలలో రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఫాతిమా మరణించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసి విద్యా సంస్థ పాఠశాలను మూసివేసింది. చిన్నారిపై కర్కషంగా వ్యవహరించిన టీచర్ తో పాటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వుడ్ బ్రిడ్జి పాఠశాలను సీజ్ చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. 

Leave a Comment