ముస్లిం దేశ కరెన్సీపై వినాయకుడి బొమ్మ..!

వినాయక చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఎంత ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యధిక శాతం ముస్లింలు ఉన్న దేశంలో గణేశుడికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఆ దేశ కరెన్సీపై వినాయకుడి బొమ్మను ముద్రించారు. 

ఇండోనేషియా కరెన్సీని రుపియా అని పిలుస్తారు. అక్కడ 20 వేల నోటుపై వినాయకుడి బొమ్మను చూడొచ్చు. ఇండోనేషియాలో దాదాపు 87.5 శాతం మంది ఇస్లాం మతాన్ని విశ్వసిస్తున్నారు. హిందువులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. ఈ ముస్లిం దేశంలో వినాయకుడిని విద్య, కళ మరియు విజ్ఞాన శాస్త్రాలకు దేవుడిగా భావిస్తారు. 

నిజానికి కొన్నేళ్ల క్రితం ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో అక్కడి ఆర్థిక వేత్తలు చర్చలు జరిపి.. బుద్ధికి సంకేతమైన వినాయకుడి బొమ్మను కరెన్సీ నోటుపై ముద్దిద్దామని నిర్ణయించినట్లు స్థానికులు చెబుతున్నారు. 1998 సంవత్సరంలో ఇండోనేషియాలో 20 వేల రూపాయల కొత్త నోట్లపై వినాయకుడి బొమ్మను ముద్రించడం ప్రారంభించారు.  

Leave a Comment