తూర్పు గోదావరి జిల్లాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్..!

తూర్పు గోదావరి జిల్లాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సందడి చేస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే ఇటీవల మొదలైంది. సినిమాకు సంబంధించిన లోకెషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్ ను కూడా సెలెక్ట్ చేసుకుంది. 

ఈ సినిమా షూటింగ్ కోసం అమీర్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. కోనసీమలోని అల్లవరం ఓడలరేపు ప్రాంతాల్లో జరగబోయే సినిమా షూటింగ్ లో అమీర్ ఖాన్ పాల్గొంటారు. ఈ మేరకు ఆయన కాకినాడ సరోవర్ పోర్టికో హోటల్ లో బస చేశారు. 

ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఇంతకాలం ఈ సినిమా షూటింగ్ జమ్మూకాశ్మీర్ లడక్ లో తీశారు. ఇటీవలే నాగచైతన్య షూటింగ్ పార్టును పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. 

Leave a Comment