నేను జగన్ అనే మగాడి వద్ద పనిచేస్తున్న : మంత్రి కొడాలి నాని

రాష్ట్ర మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అల్రెడీ చచ్చిన పామని, 23 సీట్లతో చచ్చాడని, వ్యక్తిగంగా చంద్రబాబును విమర్శించాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎన్టీఆర్ దగ్గర పని చేయలేకపోయానని, రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయపోయానని చెప్పారు. ప్రస్తుతం తాను జగన్ మోహన్ రెడ్డి అనే మగాడి పనిచేస్తున్నానని, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు.

కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న చిన్న లొసుగులు అడ్డం పెట్టుకుంటున్నారన్నారు. కొన్ని వ్యవస్థలను కంట్రోల్లో పెట్టుకొని వాళ్లకు నచ్చినట్టు, వాళ్లకు లాభం చేకూరేట్టు పని చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు జరుగుతున్న కొన్ని పరిణామాలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చూసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యవస్థ, వ్యక్తులపై ఉందన్నారు. చంద్రబాబు ఆయన బినామీలు అమరావతి ప్రాంతంలో రియల్ వ్యాపారం ద్వారా వారి ఆస్తుల విలువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 

‘మేము అధికారంలోకి వస్తే దానిపై విచారణ జరిపిస్తాం. దోషులు ఎంత వారైనా కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదు. చట్టం ముందు, ఈ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దానికి అనుగుణంగా ఎంక్వయిరీ చేస్తామని చెబితే ఈ పోసుకోలు చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే సీబీఐ, సిట్, సిఐడి ఎంక్వైరీలు చెయ్. మేము కడిగిన ముత్యంలా వస్తాం, మీరు అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తున్నారని సొల్లు నాయుడు సొల్లు కబుర్లు చెప్పాడు.’ అంటూ కొడాలి నాని విమర్శించారు. సీఐడీ ఎంక్వయిరీ వేస్తే తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని, విచారణ నిలుపుదల చేయాలని కోరితే కోర్టు నిలిపుదల చేసిందన్నారు. 

 చంద్రబాబు తన దగ్గర ఉన్న కొంత మంది ఎంపీలను బిజెపిలోకి పంపారని, వాళ్లను అడ్డం పెట్టుకొని సిబిఐ ఎంక్వయిరీ చేయనీయడం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఏ రాజకీయ నాయకుడు గాని ఇప్పటివరకు దమ్ము, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిలా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. జగన్ లాంటి వ్యక్తిని భావితరాలు ఇంకా చూస్తాయా, చూడవో తెలియదని, గతంలో అయితే ఇంత దమ్ము, ధైర్యంగా ముందుకు అడుగు వేసిన వ్యక్తులను అయితే ఇంతవరకు దేశ చరిత్రలో చూడలేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా చూస్తామో, చూడమో తెలియదన్నారు. న్యాయస్థానాలు, మీడియా అంటే నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఎంతో నమ్మకంతో ఉన్నామన్నారు. ఆలస్యమైనప్పటికీ ఈ విషయంపై సుప్రీంకోర్టులో తెలుసుకుంటామన్నారు. అవసరమైతే పార్లమెంట్ లో చర్చకు పెడతామన్నారు.

రూపాయి డీజిల్ పై పెంచడం వల్ల ఒక పెట్రోల్ బాంబు జగన్మోహన్ రెడ్డి ప్రజలపై వేశారని ఈనాడులో రాశారన్నారు. మోడీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే పది రూపాయల వరకు పెంచిందని, ఈ వార్తను కనీసం జిల్లా పేపర్ లో కూడా రాయలేదని చెప్పారు. మోడీ తాట తీస్తారని భయమా అని ప్రశ్నించారు.  చంద్రబాబు నాయుడు రాజధానికి రెండు రూపాయలు సెస్సు వేసి పెట్రోల్, డీజిల్ పై కన్నాలు వేసినప్పుడు ఈ గుడ్డి పేపర్లు, ఛానెల్స్ కు కనపడలేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. 

Leave a Comment