సంపేయ్ సారూ..నన్ను సంపేయ్..!

డాక్టర్ వద్దకు వెళ్లాలంటే చిన్న పిల్లలకు భయం..ఎక్కడ సూది వేస్తాడో అని.. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఏవేవో సాకులు చెబుతుంటారు.. ఏదైన నొప్పులకు ఫిజిషియన్ వద్ద చికిత్స తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి.. ఈ వీడియోలో ఉన్న బుడ్డోడు కూడా నొప్పిని భరించలేక డాక్టర్ కు సాకులు చెప్పి ప్రయత్నం చేశాడు.. ఆ బుడ్డోడికి డాక్టర్ ఫిజియోథెరపీ చేస్తున్నాడు..అక్కడ ఆ పిల్లవాడు చేసిన అల్లరి నవ్వులు తెప్పిస్తోంది..

డాక్లర్ ఫిజియోథెరపి చేస్తుంటే ఆ నొప్పిని భరించలేని బుడ్డోడు.. నొప్పి పుడుతుంది సారూ, మీ కాళ్లు మొక్కుతా. మీకు పుణ్యం ఉటుంది.. అంటూ బతిమిలాడాడు.. సంపేయ్ సారూ నన్ను సంపేయ్..ఆ కత్తెరతో నన్ను సంపేయ్ సారూ.. మీరందరూ మంచోళ్లు నన్ను విడిచిపెట్టండి.. అంటూ డాక్టర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. ఈ వీడియో చూస్తున్నంత సేపు నవ్వు ఆపుకోలేరు..

Leave a Comment