కూలీ పనులు చేసిన డబ్బుతో సోనూసూద్ విగ్రహం..!

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. అడిగిన వారికి చేతనైన సాయం చేస్తూ వస్తున్నాడు. దీంతో సోనూసూద్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాదిస్తున్నారు. తన కోసం పాదయాత్రలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు పలుచోట్ల సోనూసూద్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.  

తాజాగా ఓ నిరుపేద కుటుంబం సోనూసూద్ కు అరుదైన గౌరవాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భోనకల్ మండలం గార్లపాడుకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు, మరియమ్మ దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుననారు. కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు ఈ దంపతులు ఫిదా అయ్యారు. దీంతో కూలీ పనులు చేసి కూడగట్టిన రూ.25 వేలతో విజయవాడలో విగ్రహం తయారు చేయించారు. దసరాలోపు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

 

Leave a Comment