భార్య నల్లగా ఉందని.. విడాకులు ఇచ్చిన భర్త..!

భార్య నల్లగా ఉందనే కారణంతో ఆమెకు తలాక్ చెప్పాడు ఓ భర్త.. వివాహం జరిగిన తొమ్మిది నెలలకే విడాకులు ఇచ్చాడు. దీంతో ఆ మహిళ భర్తపై కేసు పెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. 

బాధిత మహిళకు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆలం అనే వ్యక్తితో ఈ ఏడాది మార్చి 7న పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో సుమారు మూడెకరాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం తేవాలని మహిళను వేధించడం ప్రారంభించారు.

ఆమె తండ్రి వద్ద మిగిలి ఉన్న భూమిని అమ్మి రూ.10 లక్షలు తీసుకురావాలని, ఆ డబ్బుతో కారు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మహిళ అందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై పలు మార్లు దాడి చేశారు. అంతేకాదు ఆమె నల్లగా ఉండటంతో భర్త, అత్తింటివారు హేళన చేయడం సహా హింస్తున్నట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.  

Leave a Comment