Viral Video: భార్యకు షాపింగ్ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో నిరూపించిన భర్త..!

షాపింగ్ అంటే మహిళలకు పిచ్చి అని తెలిసిందే.. షాపింగ్ కి వెళ్తే చాలు అవసరానికి మించి కొనేస్తుంటారు..పైగా అలా తామెందుకు కొంటాం అంటూ వాదిస్తుంటారు.. మహిళల షాపింగ్ విషయంలో పురుషుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తుంటాయి కూడా.. అయితే ఓ భర్త మాత్రం తన భార్యకు షాపింగ్ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో ఆధారాలతో సహా నిరూపించాడు.. 

రాబర్ట్ అనే వ్యక్తి తన భార్య ఏ రేంజ్ లో షాపింగ్ చేస్తుందో నిరూపించాలని అనుకున్నాడు. తన భార్యకు ఎన్ని జతల చెప్పులు ఉన్నాయో చూపించాలనుకున్నాడు. అందుకోసం తన భార్య ఊరు వదిలి వెళ్లే టైమ్ కోసం వేచి చూశాడు. అంతే ఓ రోజు ఆ సమయం వచ్చేసంది.. తన భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది..

అంతే.. తన భార్య చెప్పుల జతలను ఒక వరుసలో పెట్టుకుంటూ పోయాడు. అలా ఒకదాని తర్వాత మరొకటి పేర్చుకుంటూ పోయాడు. బిల్డింగ్ పై నుంచి కింది వరక చెప్పుల వరుస వెళ్లింది. అలా చెప్పుల జతలను లెక్కించాడు. ఆ చెప్పుల జతల సంఖ్య వందకు చేరింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

 

Leave a Comment