మీ లైఫ్ పార్టనర్ తో ఇలాగే ఉంటున్నారా?

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య బంధం బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచిన కొద్ది ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న మనస్పర్థలు ప్రారంభమవుతాయి.. అపార్థాలు జరగడం, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల గొడవలు పెద్దవి అవుతాయి. దంపతుల మధ్య బంధం కొనసాగాలంటే అది ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రిలేషన్ షిప్ ఉండాలంటే ఈ పద్ధతులు పాటించాలి.. 

దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే..

  • వివాహ బంధంగా బలంగా ఉండాలంటే.. ఫస్ట్ ఇద్దరి మధ్య ఒకరిప మరొకరికి ప్రేమ, స్వేచ్ఛ ఉండాలి. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కలిసి మెలగాలి..
  • ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచిది కాదు.. ఎందుకంటే ఈ పద్ధతి మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. 
  • దంపతులు ఒకరినొకరు కించపరిచే విధంగా మాట్లాడుకోకూడదు. గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాలి. 
  • భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం.. కానీ వాటిని పెద్దవి చేయకూడదు. ఎవరైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి.. 
  • బిజీ జీవితంలో ఎంత పని ఉన్నా రోజూ మీ భాగస్వామితో కాసేపు గడపండి. అభిప్రాయాలు పంచుకోండి. వారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. కుటుంబం గురించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరూ చర్చించుకోండి.. 
  • దంపతలు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పనిచేయకూడదు. ఏ విషయమైనా చెప్ప చేయడం మంచిది. అప్పుడు మనస్పర్థలు రావు. 

Leave a Comment