భారీగా తగ్గిన బంగారం ధర..

గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర, శుక్రవారం భారీగా తగ్గింది. తాజాగా గత వారం రూ.45వేల మార్కును దాటిన బంగారం..క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. శుక్రవారం స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలకు బ్రేకులు పడింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించడంతో పాటు..డాలర్ తో రూపాయి విలువ బలపడడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1097 తగ్గి..రూ.42,600కు చేరింది. అటు వెండి కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.1574 తగ్గి, రూ.44,130కి చేరుకుంది.

Leave a Comment