ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం

ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ఆరేళ్లుగా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. లేని కంపెనీల నుంచి కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు చేసి ఈ స్కామ్ కు పాల్పడ్డారు. ఈ కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ నివేదికను విడుదల చేసింది. నకిలీ  కొటేషన్లతో రేట్ కాంట్రాక్టులో లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం రూ.89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ల లో ఉన్న సంస్థలకు రూ.38 కోట్లను చెల్లించినట్లు గుర్తించారు. మిగిలిన రూ.51 కోట్లను దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు వాస్తవ ధరు కంటే 132 శాతం అదనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ముఖ్య పాత్ర పోషించిన సరఫరాదారులే ఈ స్కాంలో కూడా ఉన్నట్లు తేలింది. అప్పటి డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ తో పాటు, అరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్య పాత్ర పోషించారని అధికారులు వెల్లడించారు. 

Leave a Comment