WhatsApp లో తొలగించిన మెసేజ్ లను ఎలా చూడాలి..

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సాప్. ఫేస్ బుక్ యాజమాన్యంలోని సంస్థ వాట్సాప్ 2017లో తన వినియోగదారుల కోసం డిలీట్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ లో యూజర్లు తాము పంపిన సందేశాలను తొలగించవచ్చు. ఒక మెసేజ్ లను కాకుండా ఫొటోలు, వీడియోలను కూడా డిలీట్ చేయవచ్చు. ఆ డిలీట్ చేసిన మెసేజ్ ను ఎవరూ చూడలేరు. అయితే ఇప్పుడు తొలగించిన సందేశాన్ని కూడా చూడవచ్చు. అవును, ఇలా తొలగించిన మెసేజ్ చూడటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలలో ఒకదానిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాము. 

డిలీట్ చేసిన వాట్సాప్ సందేశాలను ఎలా చూడాలి..

వాట్సాప్ లో మెసేజ్ డిలీట్ చేసినప్పుడు చాలా మందికి వాటిని చూడాలనే ఆత్రుత ఉంటుంది. అయితే ఇంకేందుకు ఆలస్యం మీ వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మేము చెప్పే స్టెప్స్ ను ఫాలో కండి మరీ..

  • మొదటగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి WhatsRemoved+ ను డౌన్ లోడ్ చేయండి.
  • దానిని ఇన్ స్టాల్ చేయండి. తర్వాత ఆ యాప్ ను తెరవండి.  తర్వాత కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. దానిని పూర్తి చేయండి. 
  • తర్వాత మీరు మళ్లీ యాప్ లోకి వెళ్లాలి. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు మరియు స్టోర్ చేయాల్సిన మార్పులను సెలెక్ట్ చేసుకోవాాలి. 
  • ఈ జాబితాలో మీరు వాట్సాప్ ఎంచుకోవాలి. 
  • తర్వాత స్క్రీన్ లో ‘Yes’ను నొక్కండి. ఫైల్ ను సేవ్ చేయడానికి ‘Allow’ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ యాప్ ను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. 
  • ఇప్పుడు మీకు వచ్చి డిలీట్ అయిన నోటిఫికేషన్లు WhatsRemoved+ యాప్ లో స్టోర్ అయి ఉంటాయి. 

అయితే ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్ కుమాత్రమే యాపిల్ ఐఓఎస్ లో ఈ ఫీచర్ ఉండదు. ఇది గోప్యత పరంగా ఇది చాలా మంది విషయం. అయితే తొలగించిన సందేశాలను చూడాలనుకంటే అది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం. 

 

CLICK HERE TO DOWNLOAD

 

Leave a Comment