నెటిజన్లపై పోలీస్ బాస్ సీరియస్..

నెటిజన్స్ కు సీరియస్స్ వార్నింగ్ ఇచ్చారు డీజీపీ గౌతమ్ సావంగ్. వచ్చిన సమాచారాన్ని నిజమో కాదో నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే తాటా తీస్తామన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను వైరల్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మధ్య ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. వచ్చిన పోస్టులు నిజమో కాదో నిర్ధారించుకోవడం లేదు నెటిజన్స్. ఏది వస్తే దానిని ఏమీ చేసుకోకుండా పోస్ట్ చేస్తున్నారు. ఫేక్ వార్తలను అదుపు చేసేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ నిర్ణయం తీసకున్నారు. 

అయితే ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద పని చేస్తున్న రాష్ట్ర పోలీసు అధికారులతో, చెక్ పోస్టు సిబ్బందితో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోకి ఎలాంటి వాహనాలను అనుమతిస్తున్నారు..చెక్ పోస్టుల వద్ద  పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. ఏపీ పోలీసులు అప్రమత్తంగా పని చేస్తున్నారని, 24 గంటలపాటు పోలీసు సిబ్బంది చెక్ పోస్టుల వద్ద పహారా కాస్తుందని ఆయన తెలిపారు.ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. నిజామొద్దీన్ వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే గుర్తించామన్నారు. 

 

 

Leave a Comment