ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

ఓ పక్క కరోనా కేసులు.. మరో పక్క సీజనల్ వ్యాధులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో సహజంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలతో పాటు రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ ఫ్లుయాంజా వంటి వ్యాధులు ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్ బాధితులే కనిపిస్తున్నారు. దీంతో చాలా మందిలో ప్లేట్ లెట్స్ తగ్గిపోతున్నాయి. ఈ ప్లేట్ లెట్స్ తగ్గడం వల్ల ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించి ప్లేట్ లెట్స్ సంఖ్యను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.. 

బొప్పాయి:

ప్లేట్ లెట్స్ పెరుగుదలకు బొప్పాయి, బొప్పాయి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో మంచి ఔషధ గుణాలున్నాయి. బాగా పండిన బొప్పాయిని తినాలి. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్స్ గణనీయంగా పెరుగుతాయి. 

క్యారెట్:

క్యారెట్ రక్తాన్ని పెంచుతుంది. అయితే ఇది ప్లేట్ లెట్ సంఖ్యను కూడా పెంచుతుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ పెరుగుదలలో మంచి ఫలితం ఉంటుంది. 

కూర గుమ్మడి కాయ:

కూర గుమ్మడి కాయలో ఉండే మంచి పోషకాలు ఉంటాయి. ఇది ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేయడంతో దోహదపడతాయి. గుమ్మడి కాయ, దాని విత్తనాలను తరచూ తీసుకుంటే శరీరంలో ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. 

నిమ్మకాయ:

నిమ్మకాయలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజుకు రెండు సార్లు ఒక టీ స్పూన్ నిమ్మరసం తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. 

ఉసిరి:

ఉసిరిలో కూడా సీ విటమిన్ అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. రోజూ ఉదయాన్నే పరగడపున 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్ తాగాలి. లేదా ఉసిరికాయ పొడిని రోజుకు రెండు సార్లు ఒక టీ స్పూన్ మోతాదులో తేనెతో కలిపి తీసుకోవాలి. ఇది ప్లేట్ లెట్ల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతుంది.

బీట్ రూట్:

బీట్ రూట్ శరీరంలోని ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఇది నివారిస్తుంది. ప్రతిరోజూ బీట్ రూట్ రసం తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. 

గోధుమ గడ్డి రసం:

గోధుమ గడ్డిలో అధికంగా క్లోరోఫిల్ ఉంటుంది. దీని వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది. రోజు ఉదయాన్నే పరగడపున అర కప్పు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. 

పాలకూర:

పాలకూరలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. పాలకూర జ్యూస్ ను రోజూ ఉదయం తీసుకుంటే రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. 

దాన్నిమ్మ పండు:

దానిమ్మ పండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికాంగ ఉంటాయి. పండు తిన్నా లేక జ్యూస్ తాగిన ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. 

డ్రై కిస్ మిస్:

కిస్ మిస్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. ప్లేట్ లెట్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. కనుక రోజు రాత్రి గుప్పెడు కిస్ మిస్ లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తినాలి. 

Leave a Comment