అరుదైన వ్యాధితో వృద్ధురాలిగా జన్మించింది.. 

ఓ చిన్నారి అరుదైన వ్యాధితో పుట్టింది. పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సౌత్ ఆఫ్రికాలోని తూర్ప కేప్ లోని లిబోడ్ గ్రామంలో మానసిక వికలాంగురాలైన 20 ఏళ్ల మహిళ ఈ ఏడాది జూన్ లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దుదృష్టవశాత్తు ఆ చిన్నారి అరుదైన వ్యాధితో పుట్టింది. పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తోంది. ఆ చిన్నారి ప్రొజీరియాతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన ప్రగతిశీల జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు పేర్కొన్నారు. 

ఈ వ్యాధి వల్ల పిల్లలు వేగంగా వృద్ధాప్యం బారిన పడతారు. పాప జన్మించినప్పుడు ముఖం ముడతలు పడటాన్ని చిన్నారి అమ్మమ్మ గుర్తించింది. దీంతో చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. వైద్యులు ఆ చిన్నారిని, ఆమె తల్లిని పరిశీలించారు. తల్లి ఎదర్కొంటున్న అనారోగ్య సమస్య వల్ల చిన్నారికి ఈ వింత వ్యాధి సోకిందని వైద్యులు తెలిపారు. తూర్పు కేప్ ప్రావిన్షియల్ లేజిస్లేచర్ సభ్యుడిగా ఉన్న సిఫోకాజి మణి లుసితి ఈ చిన్నారికి తగిన సాయం, మద్దతు అందించాలని, నవజాత శిశువును ఎగతాళి చేయవద్దని కోరారు.  

 

Leave a Comment