లాక్ డౌన్ కోసం ఈ-పాస్ పొందడం ఎలా?

భారత  దేశంలో ప్రస్తుతం మే 3 వరకు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అత్యవసర పరిస్థితులు మరియు ప్రజలకు అవసరమైన సేవలను అందించడం మినహా అన్ని సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంది. అయితే అవసరమైన సేవలను అందించే వ్యాపారాలకు సమస్యలు లేకుండా మరియు ప్రజలకు అత్యవసర సేవలను అందించేందుకు అనేక రాష్ట్రాలు ఆన్ లైన్ లో పొందగలిగే ఈ-పాస్ లను అందిస్తున్నాయి. ఈ-పాస్ లను మూవ్ మెంట్ పాస్ లేదా Covid-19 ఎమర్జెన్సీ పాస్ లేదా లాక్ డౌన్ పాస్ అని కూడా పిలుస్తారు. ఈ – పాస్ ను ఆన్ లైన్ లో ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

లాక్ డౌన్ కోసం ఈ-పాస్ ఎలా పొందాలి?

  • లాక్ డౌన్ ఈ-పాస్ పొందేందుకు మీ రాష్ట్రం యొక్క అధికారిక వెబ్ సైట్ కు వెళ్లండి. 
  • మీ రాష్ట్ర వెబ్ సైట్ ను బట్టి Apply Here అనే ఆప్షన్ వద్ద క్లిక్ చేయండి. 
  • తరువాత ఈ-పాస్ కు గల కారణాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతి రాష్ట్రం తన వెబ్ సైట్ లో వినియోగదారుల నుంచి భిన్నమైన సమాచారాన్ని అడుగుతుంది. 
  • మీర దరఖాస్తును సమర్పించిన తర్వాత, దానిని స్థానిక పోలీసులు సమీక్షిస్తారు. తర్వాత పాస్ జారీ చేస్తారు. 
  • దరఖాస్తు పూరించడంలో ఏదైన సమస్య ఉంటే వినియోగదారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించి దానిని పరిష్కరించవచ్చు. దరఖాస్తుదారునికి ప్రత్యేకమైన టోకెన్ ఐడీ ఇవ్వబడుతుంది. 

ఈ-పాస్ యొక్క స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలి?

  • దరఖాస్తు సమర్పించిన తరువాత, వినియోగదారులు ఈ-పాస్ వెబ్ సైట్ లో ప్రత్యేకమైన ఐడీని నమోదు చేయడం ద్వారా వారి దరఖాస్తు స్టేటస్ ను తెలుసుకోవచ్చు. 
  • ఈ-పాస్ ఆమోదించబడిన తర్వాత, అధికారుల నుంచి వినియోగదారులకు ఫోన్ ద్వారా సమాచారం పంపబడుతుంది. 
  • తర్వాత మీరు ఈ-పాస్ ను ప్రింట్ తీసుకోవచ్చు. మీరు ఇంటి నుంచి బయలు దేరేటప్పుడు మీతో ఈ-పాస్ తీసుకెళ్లడం చాలా అవసరం. 

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వెబ్ సైట్లను మీకు అందిస్తున్నాము. 

ఆంధ్రప్రదేశ్ – Click Here

తెలంగాణ – Click Here

Leave a Comment