వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. ఈ సీక్రెట్ ట్రీక్ తో వారికి మెసేజ్ చేయండి..!

ఈరోజుల్లో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదనే చెప్పాలి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాట్సాప్ చెక్ చేయాల్సిందే.. వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని పదే పదే మెసేజ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటే వారిని మీరు బ్లాక్ చేయవచ్చు. అలా చేస్తే బ్లాక్ చేసిన వ్యక్తి నుంచి మెసేజ్ లేదా కాల్స్ రాకుండా ఉంటాయి. 

అయితే ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేేసిన వారికి కూడా మెసేజ్ లేదా కాల్ చేసేందుకు అవకాశం ఉంది. కొన్ని ట్రిక్స్ పాలో అవ్వడం ద్వారా బ్లాక్ చేసిన వ్యక్తులకు మెసేజ్ చేయవచ్చు. మీరు వాడే వాట్సాప్ ని ఒకసారి డిలీట్ చేసి.. మళ్లీ అదే నంబర్ పై వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీ ఖాతాను వారి అకౌంట్ లో అన్ బ్లాక్ చేయవచ్చు. అది ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం..

బ్లాక్ చేసినప్పటికీ వాట్సాప్ లో ఎలా మెసేజ్ చేయాలి?

  • ముందుగా మీ మొబైల్ లోని వాట్సాప్ అకౌంట్ ని ఓపెన్ చేయాలి. 
  • ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ లో వెళ్లి అకౌంట్స్ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • అక్కడ డిలీట్ అకౌంట్ అనే ఎంపికపై క్లిక్ చేయండి. వెంటనే మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అవుతుంది. 
  • ఆ తర్వాత అదే నంబర్ తో వాట్సాప్ ఇన్ స్టాల్ చేసి లాగిన్ అవ్వండి. అలా చేయడం వల్ల మీ అకౌంట్ ని మరొకరి వాట్సాప్ అకౌంట్ లో అన్ బ్లాక్ చేయవచ్చు. 

 

Leave a Comment