జమ చేసిన చిల్లరతో.. స్కూటీ కొన్న వ్యక్తి..!

ఎవరైనా బండి కొనాలంటే క్యాష్ లేదా డెబిట్ కార్డ్ తీసుకెళ్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం బ్యాగ్ నిండా చిల్లర నాణేలను తీసుకెళ్లాడు. వాటితో ఓ స్కూటీని కొన్నాడు. ఈ ఘటన అస్సాంలోని బార్పేట జిల్లాలో జరిగింది. అతని పేరు హఫిజుర్ అకంద్. అతనికి ఓ స్టేషనరీ షాపు ఉంది. ఆ వ్యక్తికి ద్విచక్ర వాహనం కొనాలనే కల ఉండేది. 

అయితే బండి కొనేందుకు అతని వద్ద అంత డబ్బు లేదు. కనీసం డౌన్ పేమెంట్ అయినా కట్టి బడ్డి తెచ్చుకోవాలని అనుకున్నాడు. అందుకోసం గత కొన్ని నెలలుగా చిల్లరను పోగు చేయడం ప్రారంభించాడు. అలా పోగు చేసిన చిల్లరు బ్యాగ్ నిండా అయ్యాయి. చిల్లర నాణేలు నిండిన బ్యాగ్ తో బండి కొనేందుక ఓ షోరూమ్ కి వెళ్లాడు.

మొదట్లో షోరూమ్ లోకి వెళ్లేందుకు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. చిల్లర పైసలు తెచ్చాను కదా.. ఏమనుకుంటారో అని బయటే నిలబడ్డాడు. తర్వాత ఓ సేల్స్ మెన్ హఫిజుర్ ని షోరూపమ్ లోపలికి తీసుకెళ్లాడు. ముగ్గురు షోరూమ్ సిబ్బంది ఆ బ్యాగ్ లోని చిల్లరును నాలుగు ప్లాస్టిక్ బుట్టల్లో వేసి లెక్కించారు. అలా 3 గంటల పాటు కష్టపడి లెక్కబెట్టారు. 

ఆ చిల్లర మొత్తం రూ.22 వేలు అయ్యింది. డౌన్ పేమెంట్ కట్టాలంటే ఇంకా 8 వేలు తక్కువయ్యాయి. అతడికి షోరూమ్ వారు ఫైనాన్స్ ఇప్పించారు. దీంతో హఫిజుర్ డౌన్ పేమెంట్ కట్టి సుజుకీ అవెనిస్ స్పెషల్ ఎడిషన్ స్కూటీ కొన్నాడు. హిరక్ జె దాస్ అనే యూట్యూబర్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వ్యక్తిని అభినందిస్తున్నారు. 

 

Leave a Comment