వంట నూనె.. ఏది మంచిది?

How to choose Right cook oil ?

ప్రస్తుతం మార్కెట్లో అనేక కరాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి మన ఆరోగ్యానికి సరైనవేనా? మీరు సరైన Cooking Oilను వాడటం వల్ల ఆహారంలో పోషకాలు అందడమే కాదు..అవి ఆహారంలో రుచిని మరియు సువాసనను కూడా అందిస్తాయి. 

భారతదేశంలో సాంప్రదాయకంగా ఆవాలు, వేరుశనగ, నువ్వులు మరియు కొబ్బరి నూనెలను వారీ వారీ అలవాట్ల ఆధారంగా ఉపయోగిస్తున్నారు. అయితే అవి స్థానిక లభ్యత, స్థానిక నేలలు మరియు వాతావరణపై ఆధారపడి ఉంటాయి. ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో సాధారణంగా ఆవ నూనెను ఉపయోగిస్తారు. రాజస్థాన్ నువ్వుల నూనెను, మధ్య భారతదేశంలో మరియు గుజరాత్ లో వేరుశనగ నూనెను ఉపయోగిస్తుంటారు. 

ఇక కేరళలో కొబ్బరి నూనెను ప్రధానంగా Cooking Oil గా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. కొబ్బరి నూనె 90 శాతం సంతృప్త కొవ్వుతో తయారవుతుండగా, అందులో సగం లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రోత్సాహక లక్షణాలను కలిగి ఉంది. 

పురాతన కాలం నుంచి భారతదేశంలో నెయ్యిని ఆహారంలో ఉపయోగించే వారు. మరియు నెయ్యి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. హార్మోన్లను సమతుల్యం చేయడంలో మరియు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను అందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. 

అయితే ప్రస్తుతం మనం ఉపయోగించే Cooking Oil సరైందేనా? అసలు ఎలాంటి నూనెలు వాడాలి, ఎలాంటివి వాడకూడదనే విషయాలని ఇక్కడ తెలుసుకుందాం…

మనం వాడే నూనెలు అనేక కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి మానవ జీవక్రియలో వాటి స్వంత పనితీరును కలిగి ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలను మూడు రకాలుగా విభజించవచ్చు. 

  • సంతృప్త కొవ్వు ఆమ్లాలు
  • మోనోశాచురేటెడ్
  • పాలి అసంతృప్త 

మనం తినగలిదే నూనెలలో టోకోఫెరోల్స్, కెరోటినాయిడ్స్, టోకో ట్రియానాల్స్, ఫైటోస్టెరాల్స్ మరియు సూక్ష్మ పోషకాలు వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 

పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు మోనో శాచురేటెడ్ కొవ్వులు రెండూ మితంగా తీసుకుంటే మరియు సంతృప్త కొవ్వు ఆమ్లాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. 

హైడ్రోజనేటెడ్ నూనెలను నివారించండి..

ఇవి కృత్రిమ హైడ్రోజనేటెడ్ కూరగాయాల నూనెలు. ఇవి ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మానషుల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి గది ఉష్ట్రోగ్రత వద్ద సాలిడ్ గా ఉంటాయి. దీనికి ఉదాహరణ వనస్పతి నూనె..

శుద్ధి చేసిన నూనెలు వద్దు..

శుద్ధి చేసిన నూనెలకు బదులు కోల్డ్ ప్రెస్డ్ నూనెలు వాడటం మంచిది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చాలా పోషకాలను కలిగి ఉంటాయి. మరియు సాధారణంగా సహజ రుచులలో అధికంగా ఉంటుంది. ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు, కుసుమ, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలు భారతదేశంలో కామన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. 

అధిక పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో శుద్ధి చేసిన నూనెలు ఫ్రీరాడికల్స్, ట్రాన్స్ ఫాట్స్ మొదమైన విషపూరిత భాగాలకు సులభంగా క్షీణిస్తాయి. ఇవి క్యాన్సర్ కలిగించే మరియు గుండె సంబంధిత వ్యాధులతో ముడిపడి ఉంటాయి. నూనెలను శుద్ధి చేయడం సాధారణంగా యాంటీ ఆక్సిడెంట్లను కోల్పోయేలా చేస్తుంది. 

ఆర్గానిక్ నూనెలు మంచివి..

సేంద్రియ నెనలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ముడి పదార్థాలు(గింజలు, విత్తనాలు, ధాన్యాలు, పండ్లు) నూనె యొక్క నాణ్యతను నిర్ణయించడంలో కీలమైనవి. రసాయనాలు మరియు జన్యుపరంగా మార్పు చెందిన మొక్కలను ఎక్కువగా వాడటం వల్ల, ఈ మొక్కల కొవ్వు ఆమ్లాలలో విష రసాయనాలు అధికంగా పేరుకుపోతాయి. 

బ్లెండింగ్ ఆయిల్(కోల్డ్ ప్రెస్డ్)..

 నూనెల మిశ్రమం రెండు లేదా అంతకంటే ఎక్కువ తినదగిన నూనెల శక్తిని మిళితం చేస్తుంది. ఇది కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల సమతుల్యతను అందిస్తుంది. ఈ విధానం నూనెల యొక్క ఆక్సీకరణ మరియు ఉష్ణ స్థిరత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

అయితే మనం ఒకే సారి రెండు నూనెలను కలిపి వాడకూడదు. ఉదాహరణకు ఉదయం పూట ప్రొద్దుతిరుగుడు నూనె వాడితే, సాయంత్రం పూట వేరుశనగ నూనెను వాడాలి. అలా కాకుండా ఈ రెండింటిని ఒకేసారి కలిపి వాడకూడదు. ఎందుకంటే ఒక్కో నూనె యొక్క మరిగే ఉష్ణోగ్రత ఒక్కోరకంగా ఉంటుందది. మనం నూనెను ఇలా కూడా వాడుకోవచ్చు. ఒక నెల ప్రొద్దుతిరుగుడు నూనె వాడితే, మరో నెలలో వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. ఈ విధానం వల్ల మన శరీరానికి కొవ్వులు మరియు యాంటీ ఆక్సిడెంట్ల సమస్యతుల్యంగా అందుతాయి.   

స్మోక్ పాయింట్ ఆఫ్ ఆయిల్ మరియు వంట ప్రక్రియ..

ప్రతి నూనెలో పొగపాయింట్ పరిమితి ఉంటుంది. అంతకు మించి వేడి చేస్తే నూనె విచ్ఛిన్నం కావడం మరియు హానికారమైన రసాయనాలను విడుదల చేస్తుంది. అది ఆహారం రుచిని ప్రభావితం చేయడమే కాకుండా, వినియోగానికి హానీకరం అవుతుంది.భారతదేశంలో నూనెను పదేపదే వేయించే అలవాడు ఉంది. ఇది గుండెకు చాలా హానికరమైన విషపూరిత సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. 

  • డీప్ ఫ్రై కోసం – నెయ్యి, కొబ్బరి నూనె, అవోకాడో నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి అధిక స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను డీప్ ఫ్రై కోసం వాడటం మంచిది. 
  • పాన్ ఫ్రై / సాటింగ్ – ఆవ నూనె, వేరుశనగ నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి తక్కువ స్మోక్ పాయింట్ కలిగి ఉంటాయి. వీటిని పాన్ ఫ్రై లేదా సాటింగ్ కోసం ఉపయోగించవ్చు. 
  • వెన్నను సాంప్రదాయకంగా బేకింగ్ కోసం ఉపయోగిస్తారు. అయితే కొబ్బరి నూనె మరియు ఆలివ్ నూనెలు చాలా ఆరోగ్యకరం. 

భారతీయ వంటకాల్లో ఏది మంచి ఆయిల్?

ఆవ నూనె సహజ యాంటీ ఆక్సిడెంట్లు మరియు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఇది గుండెకు మంచిది. మరియు ప్రాచీన కాలం నుంచి భారతీయులలో వంటతో పాటు చికిత్స కోసం ఈ నూనెను ఉపయోగిస్తున్నారు. ఆవ నూనెలో ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల ఆదర్శ నిష్పత్తి ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వంట చేసేటప్పుడు ఇది స్థిరంగా ఉంటుంది. 

ఫిట్నెస్ గురువులలో ఆలివ్ ఆయిల్ చాలా ప్రాచుర్యం పొందింది. నిజానికి ఇది వంట చేయడానికి మంచి నూనె. ఇది గుండె జబ్బులకు చాలా మంచిది. ఆలివ్ నూనెలో ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫాటీ ఆమ్లాలు ఉండవు. కావున ఈ నూనెను డీప్ ఫ్రయింగ్ కోసం వాడకూడదు.

సూచనలు..

  • హైడ్రోజనేటెడ్ నూనెలను సాధ్యమైనంత వరకు నివారించడానికి ప్రయత్నించండి. కోల్డ్ ప్రెస్ తినదగిన నూనెలను వాడండి. సేంద్రియ నూనె అయితే ఇంకా మంచిది. 
  • ప్రతి రోజూ ఒకే వంట నూనెను వాడకుండా, కొన్ని రకాల కోల్డ్ ప్రెస్ నూనెలను వాడటం మంచిది. 
  • స్మోక్ పాయింట్ ఆధారంగా వంట నూనెను ఎంచుకోండి. 
  • దేశంలోని అనేక ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి ఉపయోగించబడుతున్న ఆవ నూనె ఆరోగ్యకరమైన నూనెలలో ఒకటి. 

Leave a Comment