మీ రేషన్ కార్డు పని చేస్తుందా? తెలుసుకోవడం ఎలా?

తెల్ల రేషన్ కార్డ్ లేనిదే నిరుపేద కుటుంబాలకు రోజు గడవడం కష్టం.Ration card అనేది సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను కొనుగులు చేసేందుకు అర్హత ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అధికార పత్రం. ఈ కార్డు చాలా మందకి గుర్తింపు కార్డుల లాగా కూడా పని చేస్తుంది. ఈ Ration cardలను ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం వినియోగదారుల కోసం రెండు Ration cardలను ఇస్తుంది. 

  1. తెల్ల రేషన్ కార్డు
  2. పింక్ రేషన్ కార్డు

ఇందులో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ షాపుల నుంచి బియ్యం, పప్పు ధాన్యాలు, చింతపండు, గోధుమ పిండి వంటి నిత్యావసరాలు తక్కువ ధరకే నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ రేషన్ కార్డు గుర్తింపు కార్డుగా కూడా చెల్లు బాటు అవుతుంది.  అందుకే కొత్తగా పెళ్లయిన జంట కూడా కొత్త తెల్ల కార్డుకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే Ration card ఉన్న వారు తమ కార్డు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పడు మనం ఆన్ లైన్ లో మన Ration card యొక్క స్టేటస్ ను తెలుసుకుందాం.. 

How to check ration card status in ap

  • మొదటగా మనం ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్ సైట్ epdsap.ap.gov.in లింక్ ను క్లిక్ చేయాలి.
  • అప్పుడు మనకు Ration card అధికారిక వెబ్ సైట్ యొక్క హోం స్కీన్ ఓపెన్ అవుతుంది. 
  • అక్కడ కింద మనకు Search Ration Card అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
  • అందులో మీ Ration card నెంబర్ ను ఎంటర్ చేసి Search అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.

  • దాని తర్వాత మన పూర్తి Ration card వివరాలు ఫొటో, పేర్లతో సహా కనిపిస్తాయి. 
  • అందులో పైన మన Ration card స్టేటస్ కనిపిస్తుంది. అక్కడ Active అని ఉంటే మన రేషన్ కార్డు పని చేస్తుందని అర్థం.
  • ఇలా సులభంగా మన Ration card స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

WEBSITE : https://epdsap.ap.gov.in/epdsAP/epds

Leave a Comment