ఈ సారీ ‘ఆప్’ కే ఢిల్లీ పీఠం…!

కేజ్రీవాల్ పైనే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే 2015 ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైతే.. ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. 

కాగా ఈ ఎన్నికల ఫలితాలపై వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. మరోసారి కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆప్ కు 50 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. 

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

 

సంస్థ ఆప్బీజేపీకాంగ్రెస్ ఇతరులు
Times Now472300
India Today59-682-1100
Republic TV48-619-210-10
ABP NEWS49-635-190-40
TV9 Bharatvarsh52-646-160-20

 

70 స్థానాలకు 672 మంది పోటీ…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి వివిధ పార్టీలకు చెందిన 672 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు. 

ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతాయ్ – బీజేపీ

అయితే ఎగ్జిట్ పోల్స్ పై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ట్విట్టర్ లో స్పందించారు. ఫలితాల రోజున ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమవుతాయని తెలిపారు. 48 స్థానాల్లో విజయం సాధించబోెతున్నామని అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీనే అని తివారీ తెలిపారు. తమ వియజం ఖాయమని పేర్కొన్న ఆయన, ఎవరూ ఈవీఎంలను నిందించవద్దని పేర్కొన్నారు.

Leave a Comment