వారం రోజుల్లో రేషన్ కార్డు..దరఖాస్తు చేయడం ఎలా? 

మీకు Ration Card లేదా ? అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి.  Ration Card లేని వారు దరఖాస్తు పెట్టుకుంటే వారికి వారం రోజుల్లో  Ration Card అందజేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ మీకు  Ration Card లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా పస్తులు ఉండకూడదని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా పేదలకు రెండో విడత  Ration పంపిణీ చేస్తోంది. ప్రజలు గుమిగూడకుండా టోకెన్లు ఇస్తున్నారు. ఎవరు ఏ రోజు రేషన్ కోసం రావాలో, ఏ కౌంటర్ వద్దకు రావాలో స్లిప్పులో రాస్తున్నారు.  

కరోనా సహాయం కింద  Ration తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత రేషన్ కార్డు ఉన్నా, బియ్యం తీసుకున్నా సరే..వెంటనే వారి అభ్యర్థనను పరిగనలోకి తీసుకుని రూ.వెయ్యి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఎవరికైతే  Ration Card లేదో వారు దరఖాస్తు పెట్టుకుంటే వారం పది రోజుల్లో అధికారులు పరిశీలన చేసి కార్డు మంజూరు చేస్తారు. ఈ మేరకు ఉత్తర్వులను సీఎం జగన్ జారీ చేశారు.  కరోనా నేపథ్యంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదని, ఎవరు రేషన్ అడిగినా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసకున్నారు.  

రేషన్ కార్డుకు ఇలా దరఖాస్తు చేసుకోండి..

  • ముందుగా మీరు స్పందన వెబ్ సైట్ https://www.spandana.ap.gov.in లోకి వెళ్లండి. 
  • అక్కడ మీకు డిపార్ట్ మెంట్ లాగిన్ మరియు ఆన్ లైన్ యూజర్ లాగిన్ అనే రెండు ఆప్షన్లు కనిపస్తాయి. 
  • మీరు ఆన్ లైన్ యూజర్ లాగిన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ కార్డు ఎంటర్ క్యాప్చ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కు లింక్ అయి ఉన్న మొబైల్ కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • అక్కడ మీకు అర్జీ నమోదు అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి.
  • తర్వాత మీరు ఎందుకోసం అర్జీ పెడుతున్నారో ఆప్షన్ ను ఎంచుకోండి. అక్కడ మీ ప్రతాలను జత చేయాల్సి ఉంటుంది. 
  • లేదా మీ గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి కూడా మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

WebSite Links:

Link 1: https://www.spandana.ap.gov.in/online_user
Link 2: https://www.spandana.ap.gov.in/

Leave a Comment