మే 3 తరువాతే ఇంటర్వ్యూలు : యూపీఎస్సీ

వాయిదా వేసిన పరీక్షలకు తాజా తేదీలపై నిర్ణయం

వాయిదా పడిన అన్ని పరీక్షలు మరియు ఇంటర్వ్యూలకు సంబంధించిన తేదీలను మే 3 తర్వాత ప్రకటించనున్నట్లు యూనియన్ పబ్లిక్ కమిషన్(UPSC) నిర్ణయించింది. కరోనా వైరస్ నుంచి ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించడానికి బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

రెండో దశ లాక్ డౌన్ తర్వాత మిగిలిన సివిల్ సర్వీసెస్ 2019 పర్సనాలిటీ టెస్టుల కోసం తాజా తేదీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

లాక్ డౌన్ కు ముందు Civil Services-2020(prelims), Engineering Services (Main) and the Geologist Services (Main) పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షలలో ఏదైనా రీషెడ్యూల్ చేయడాన్ని కమిషన్ తన అధికారిక వెబ్ సైట్ లో తెలియజేస్తుంది. 

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2020 వాయిదా కోసం ఇప్పటికే కమిషన్ నోటీసులు విడుదల చేసింది. 

CAPF-2020 పరీక్ష తేదీలను వెబ్ సైట్ లో యూపీఎస్సి తెలియజేస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) ఎగ్జామినేషన్ ఇప్పటికే వాయిదా వేయబడింది. జూన్ 10, 2020 న NDA-2 పరీక్షపై కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. 

 

Leave a Comment