రేకుల షెడ్డుకు రూ.21 కోట్ల కరెంట్ బిల్.. షాక్ అయిన యజమాని..!

అది ఒక రేకుట షెడ్డు. గట్టిగా గాలి వస్తే పడిపోయేలా ఉంటుంది. అందులో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఒక టీవీ, ఫ్యాన్, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అలాంటి ఇంటికి కరెంట్ బిల్ వస్తే ఏ వందల్లో వస్తుంది. మరీ ఎక్కువ వస్తే వేలల్లో వస్తుంది.. కానీ ఆ ఇంటికి వచ్చిన కరెంట్ బిల్ ఏకంగా రూ.21 కోట్లు.. బిల్లు చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.. 

నిర్మల్ జిల్లా సారంగాపూర్ కి చెందిన వడ్ల అవుజయ్యకు రేకుల ఇల్లు ఉంది. ఆ ఇంటికి బుధవారం కరెంట్ రీడింగ్ తీసి బిల్లు అవుజయ్యకు ఇచ్చాడు. ఆ బిల్లు చూసిన అవుజయ్య షాక్ అయ్యాడు. ప్రతి నెలా వచ్చినట్లు ఏ వందల్లో వస్తుందనుకుంటే.. ఏకంగా కోట్ల రూపాయల్లో వచ్చింది. 

ఆ ఇంటికి కరెంట్ బిల్లు మొత్తం రూ.21,47,48,364 వచ్చింది. ఈ బిల్లు తీసుకొని వెంటనే అధికారుల వద్దకు వెళ్లాడు. ఆ బిల్లు చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. స్కానింగ్ మెసీన్ లోని సాంకేతిక లోపం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. మళ్లీ స్కానింగ్ తీస్తే కరెంట్ బిల్లు ఎప్పటిలాగే వచ్చింది. దీంతో అవుజయ్య ఊపిరి పీల్చుకున్నాడు.    

Leave a Comment